Saturday, January 4, 2025
Google search engine
HomeUncategorizedY. Kasi Viswanath: మనిషి మాములుగా కనిస్తాడు కానీ.. ఈయన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Y. Kasi Viswanath: మనిషి మాములుగా కనిస్తాడు కానీ.. ఈయన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చాలా మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఆయన పేరు వై. కాశీ విశ్వనాథ్. ఈయన చాలా సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన నచ్చావులే సినిమాలో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతోనే ఆయన నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు కాశీ విశ్వనాథ్. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించాడు. అయితే ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన దర్శకుడు కూడా.

నటుడిగా సినిమాలు చేయకముందు కాశీ విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలు చేశాడు. ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా.. సినిమాలకు కో డైరెక్టర్ గా చేశారు. చాలా మంది దర్శకుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది ఆయనకు.. అంతే కాదు కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తన ప్రతిభను కూడా చాటుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. అప్పటిలో ఆ సినిమా సెన్సేషనల్ హిట్.. ఆ మూవీ మరేదో కాదు నువ్వులేక నేను లేను.

2002 లో విడుదలైన నువ్వు లేక నేను లేను సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అప్పటి లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేశారు. అలాగే లయ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ అందమైన ప్రేమ కథకు వై. కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో, డి. రామానాయుడు సమర్పణలో నిర్మించారు. అలాగే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా తర్వాత తొలి చూపులో అనే సినిమాకు కూడా విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన దర్శకత్వం వైపు వెళ్ళలేదు, నటుడిగా మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నువ్వులేక నేను లేను అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా డైరెక్టర్ ఈయనే అని చాలా మందికి తెలియదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments