Vishwak Sen: లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ

0
29
లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఆతర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేశాడు. ఇప్పటికే మెకానిక్ రాకీ అనే సినిమాను ఇప్పటికే చేస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్. ఈ సినిమాకు లైలా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. విశ్వక్ సీన్ లేడీ గెటప్ లో ఎలా ఉంటాడు.? ఎలా నటిస్తాడు.. అని అంతా మాట్లాడుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించాడు. కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. అచ్చం అమ్మాయిలా మెస్మరైజ్ చేశాడు విశ్వక్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here