Vishwak Sen: ఇదెక్కడి క్రేజీ న్యూస్ రా మావా..! అనుదీప్ డైరెక్షన్‌లో మాస్ కా దాస్

0
20
అనుదీప్ డైరెక్షన్‌లో మాస్ కా దాస్..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హిట్లు , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. వచ్చిన ఆఫర్స్ ను వదలకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫలక్ నామా దాస్ లాంటి మాస్ సినిమా, అర్జున కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమా, లేదా దాస్ కా ధమ్కీ లాంటి యాక్షన్ సినిమా అయినా సరే తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మాస్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వక్ వరుసగా సినిమాలను లైనప్ చేసి బిజీగా మారిపోయాడు. ఇప్పటికే విశ్వక్ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

రీసెంట్ గా లైలా అనే సినిమా చేశాడు విశ్వక్. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ చేశాడు విశ్వక్. జాతిరత్నాలు సినిమాతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు అనుదీప్ తో విశ్వక్ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతోంది అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుదీప్ శివకార్తికేయన్ తో సినిమా చేశాడు. ప్రిన్స్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు అనుదీప్. రీసెంట్ గా కల్కి సినిమాలో అలా కనిపించి ఇలా మాయమయ్యాడు అనుదీప్. ఇప్పుడు విశ్వక్, అనుదీప్ కాంబోలో సినిమా వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ కలిస్తే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here