Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ.. విందు భోజనం సినిమాకు భారీ వ్యూస్..

0
26
Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ.. విందు భోజనం సినిమాకు భారీ వ్యూస్..

Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ.. విందు భోజనం సినిమాకు భారీ వ్యూస్..

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే రకరకాల గేమ్ షోస్, ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తున్న ఆహా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 10న యారో సినిమాస్ తాజా బ్లాక్ బస్టర్  “విందు భోజనం”  రీసెంట్ గా ఆహా OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల అయ్యింది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంకి మంది ప్రశంసలను అలాగే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను వస్తుంది. కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన “విందు భోజనం”, చాలా మంది నటించారు.. అదేవిధంగా  ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాలోని ఆకర్షణీయమైన కథాంశం, అద్భుతమైన ప్రదర్శనలు, ఆకట్టుకునే విజువల్స్‌తో తెలుగు సినిమా వీక్షకులను ఆకర్షించింది.

ఈ చిత్రంలో అఖిల్ రాజ్, ఐశ్వర్య హోలక్కల్, సిద్ధార్థ్ గొల్లపూడి, అభిషేక్ బొడ్డేపల్లి, హర్ష వర్ధన్, అనిత చౌదరి, కేశవ్ దీపక్, అశ్రిత వేముగంటి, మురళీకృష్ణ, బాల ,వీరబధ్రమ్ నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాకు అజయ్, దేవ్ దీప్ కుందు సినిమాటోగ్రఫీ అందించారు.

‘విందు భోజనం’కు ఆహాలో వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన చూసి మేము సంతోషిస్తున్నాము” అని ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ డైరెక్టర్, యారో సినిమాస్ బ్యానర్‌లో విడుదల ఐన ‘విందు భోజనం’ నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. “ఈ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే హై-క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందన్న నమ్మకం మాకందరికీ ఉంది అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here