మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏ విషయాన్ని గురించి చెప్పినా చాలా ఇంట్రస్టింగ్‌గా చెప్తారనే పేరుంది. రీసెంట్గా ఓ వేదిక మీద ఆయన తన లవ్‌స్టోరీని షేర్ చేసుకున్న విధానం కూడా పలువురిని ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి కాలేజీ చదువుతున్నప్పుడు తొలిసారి ప్రేమలో పడ్డారట. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి మక్కళ్ సెల్వన్‌కి చాలా నచ్చిందట. ఆమె స్కూలుకి వెళ్లే సమయానికి, స్కూలు నుంచి వచ్చే టైమ్‌కి కచ్చితంగా బస్‌స్టాప్‌లో వెయిట్ చేసేవారట సేతుపతి.
తనకీ, ఆమెకీ ఏజ్ గ్యాప్ కరెక్ట్ గా ఉంటుందని, తాను సెటిల్ అయ్యాక వాళ్లింటికి వెళ్లి సంబంధం మాట్లాడటానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని, ఆ అమ్మాయిని సెలక్ట్ చేసుకున్నారట సేతుపతి. కానీ కాలగమనంలో ఆ ప్రేమ కలిసి రాలేదట. తాను ప్రేమించిన విషయాన్ని ఆ అమ్మాయికి కూడా చెప్పలేదట.
ఆ తర్వాత ఆ అమ్మాయిని తానెప్పుడూ చూడలేదని కూడా అన్నారు సేతుపతి. ఆ తర్వాత కెరీర్ అంటూ బిజీగా గడిపిన విజయ్‌కి ఆన్లైన్లో జెస్సీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమ పెళ్లిగా మారింది. ''నాకూ, నా భార్యకి ఏడాదిన్నర తేడా ఉంది.
తనకన్నా నేను పెద్ద అని అనుకునేరు. తనే నా కన్నా ఏడాదిన్నర పెద్దది. ఒకప్పుడు ముందుచూపుతో నాలుగేళ్ల చిన్నమ్మాయిని చూసి ప్రేమించాను. కానీ నా రాతలో తను లేదు. విధి ఇంకోలా ఆలోచించింది. కాబట్టి జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకూడదు. భవిష్యత్తు గురించి ఊహల్లోకి వెళ్లకుండా, ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి'' అని అన్నారు విజయ్ సేతుపతి.