Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ సాయం.. దేవుడితో పోలుస్తూ థ్యాంక్స్ చెప్పిన ట్రాన్స్ జెండర్.. వీడియో

0
19
విజయ్ దేవరకొండ సాయం.. దేవుడితో పోల్చిన ట్రాన్స్ జెండర్.. వీడియో

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఈ హీరో చూపించే యాటిట్యూడ్, మేనరిజమ్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ లేడీ ఫ్యాన్స్ విజయ్ అంటే పడి చేస్తారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు విజయ్. ఇక ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తుంటాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ క్రమంలో విజయ్ దేవర కొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ అయ్యారు. సాయం విషయంలో విజయ్ ను దేవుడితో పోల్చుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సార్‌. మీకు థ్యాంక్స్‌ చెప్పాలని గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. మాకు భిక్షాటనే జీవనాధారం సార్‌. లాక్‌డౌన్‌ కారణంగా అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో మా జీవనం చాలా కష్టమైంది. నేను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. అదే టైంలో గూగుల్‌ విజయ్‌ ఫౌండేషన్‌ అని కనిపించింది. అది క్లిక్‌ చేసి నాకు సాయం కావాలని దరఖాస్తు ఫిల్‌ చేశాను. అది చేసిన 16 నిమిషాల్లోనే మీ ఫౌండేషన్‌ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్క నాకే కాదు నాలాంటి 18 మంది ట్రాన్స్‌ జెండర్లకు మీరు సాయం చేశారు. అప్పుడు నాకు నిజంగా అనిపింది.. దేవుడు ఎక్కడో లేడు. మీలోనే ఉన్నారు అని’ ట్రాన్స్ జెండర్ కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

దీనికి విజయ్ కూడా స్పందించాడు. ‘ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎక్కడి నుంచో రూ. 500, రూ. 1000 సాయం చేశారు. వారందరి వల్లే ఇది సాధ్యమైంది. ఇంత మంచి మనుషులు మన మధ్య మనం ఉండటం మన ఆశీర్వాదం’ అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండ చేసిన మంచి పనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here