Vijay Devarakonda : శ్రీలంకలో విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్‏కమ్.. ఎందుకు వెళ్లారంటే..

0
21
Vijay Devarakonda : శ్రీలంకలో విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్‏కమ్.. ఎందుకు వెళ్లారంటే..

Vijay Devarakonda : శ్రీలంకలో విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్‏కమ్.. ఎందుకు వెళ్లారంటే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా రేంజ్‏లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ తోపాటు, నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో అర్జునుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. కల్కి చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు తిరిగి తన అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు వీడి12 వర్కింగ్ టైటిల్. తాజాగా ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో కథానాయిక ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వర్క్ చేయనున్నాడు. వీడీ 13 వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here