Urvashi Rautela: బాలయ్య సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

0
21
బాలయ్య సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు తీవ్ర గాయాలు

బాలకృష్ణ లేటెస్ట్ సినిమా ఎన్‌బీకే 109 (వర్కింగ్ టైటిల్‌)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తోన్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు తీవ్రగాయమైంది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఊర్వశి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని ఆమె టీమ్ తెలిపింది. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కిస్తోన్న ఎన్‌బీకే 109 మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరగుతోంది. ఇటీవలే తన షూటింగ్ పార్ట్ కోసం ఊర్వశి హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయం తీవ్రతపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊర్వశి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతెలాతో పాటు తెలుగమ్మాయి చాందిని చౌదరీ మరో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ బాలీవుడు నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. . సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్‌బీకే 109 మూవీ ఈ ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.ఇక ఊర్వశి రౌతెలా విషయానికి వస్తే.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందామె. అయితే గత కొన్నేళ్లుగా తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తుందీ అందాల తార. . ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’, ‘ఏజెంట్’, ‘స్కంద’ సినిమాల్లో ఊర్వశి రౌతెలా చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతెలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here