Turbo Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ యాక్షన్ థ్రిల్లర్.. టర్బో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

0
14
Turbo Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ యాక్షన్ థ్రిల్లర్.. టర్బో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కొన్నాళ్లుగా మలయాళీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఊహించని రేంజ్‏లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం భాషలలోనూ అదరగొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాలు సూపర్ హిట్ కాగా.. మరికొన్ని చిత్రాలు ఓటీటీలో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో సూపర్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే టర్బో. డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. అలాగే రాజ్ బి శెట్టి కీలకపాత్ర పోషించారు.

మమ్ముట్టి కంపానీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, సునీల్, కబీర్ దుహన్ సింగ్, అంజనా జయప్రకాష్, నిరంజన అనూప్, బిందు పనికర్, దిలీష్ పోతన్ కీలకపాత్రలు పోషించగా.. క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ ఏడాది మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ గా ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక థియేటర్లలో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో ఈ సినిమా ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా వెల్లడించారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ ప్యాక్ట్ చిత్రంలో మమ్ముట్టి జీప్ డ్రైవర్ అరువిపురతు జోస్‌ పాత్రలో కనిపించాడు. అలాగే ఇందులో అంజనా జయప్రకాష్ ఇంధులేఖ నాయర్‌ పాత్రలో కనిపించగా.. వెట్రివేల్ షణ్ముగ సుందరం పాత్రలో రాజ్ బి. శెట్టి నటించారు. తన స్నేహితుడికి జరిగిన మోసానికి న్యాయం కోసం పోరాడే జీప్ డ్రైవర్ అరువిపురత్ జోస్ కథ చుట్టే ఈ సినిమా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here