Trending: ఏంటి.. ఈ అప్సరస అమితాబ్ మనవరాలా..? ఇన్నాళ్లూ ఎక్కడున్నారు మేడమ్

0
51
Navya Naveli

అమితాబ్ బచ్చన్.. సిల్వర్ స్క్రీన్‌పై తిరుగులేని సూపర్ స్టార్. ఆయన ఏ పాత్ర చేసినా 1000 శాతం న్యాయం చేస్తారు. హీరోగా దశబ్ధాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆయన.. ఇప్పుడు సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. 81 ఏళ్ల వయస్సులో కల్కీ సినిమాలో ఆయన చేసిన అశ్వత్థామ క్యారెక్టర్ నభూతో నభవిష్యతి!. ఆయన్ను ఆ రోల్‌లో అలా చూస్తుంటే అశ్వత్థామ నిజంగా వచ్చారేమో అనిపించింది. కాగా అమితాబ్ లెగసీని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ముందుకు తీసుకువెళ్తున్నాడు. అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా ఇండస్ట్రీపై తన మార్క్ వేస్తున్నారు.

అయితే బిగ్ బీ కుమార్తె.. మనవరాలు(కూతురు కుమార్తె) మాత్రం వ్యాపార రంగంలో తమ మార్క్చూపిస్తున్నారు. అమితాబ్ కూతురు… శ్వేత బచ్చన్ నందా కుమార్తె… నవ్య నవేలి నందా బిజినెస్‌లో అద్భుతమైన గ్రోత్‌తో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. 26 ఏళ్ల ఏజ్‌లోనే.. స్మార్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్ స్థాపించి.. చాలామంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. విమెన్ ఎంపౌర్‌మింట్ దిశగా వాళ్లను ప్రొత్యహించేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ సంగీత్ ఈవెంట్‌లో నవ్య మెరిసింది. ఈ వేడకలో రెడ్ కలర్.. ఔట్‌ఫిట్‌లో.. ఆమెను చూస్తే ఇంద్రలోకం నుంచి దిగి వచ్చినట్లే అనిపించింది. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్ల కంటే అందంగా ఉందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఎప్పటికైనా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా.. అసలు నటనపై ఇంట్రస్ట్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Navya Naveli

Navya Naveli

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here