Tuesday, December 24, 2024
Google search engine
HomeUncategorizedTollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న...

Tollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న హీరోయిన్..

Tollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న హీరోయిన్..

ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇప్పుడు సినీ పరిశ్రమలో సర్వసాధారణమయ్యాయి. సంవత్సరాల లవ్ స్టోరీస్.. క్షణకాలంలో విడిపోతున్నాయి.. ఇక పాతికేళ్ల వైవాహిక బంధాలకు కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడూ ఎవరు డివోర్స్ కూడా ప్రకటిస్తారో అనేది తెలియడం లేదు. అయితే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన నటి.. పాన్ ఇండియాలోనే అగ్రస్థానంలో కొనసాగిన కథానాయిక జీవితం మాత్రం చాలా విభిన్నం. ఇప్పటివరకు మొత్తం 12 మందిని ప్రేమాయణం నడిపింది. కానీ అవేవి ఎక్కువ కాలం నిలవలేదు. ప్రేమ మాత్రమే కాదు.. పెళ్లి కూడా కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే భర్తతో విడిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అగ్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ తనకు సరైన వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఆమె ఎవరో తెలుసా.. ? అలనాటి హీరోయిన్ మనీషా కోయిరాలా.

90వ దశకంలో సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు వేసింది. సినీరంగుల ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. బాబా, ముంబయి, డియర్ మాయ, లస్ట్ స్టోరీ, సంజు, ప్రస్థానం, షెహజాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వయసు పెరుగుతున్నకొద్ది అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలకు దూరమైన సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది. ఈ సమస్యకు చికిత్స తీసుకున్న మనీషా.. క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. ఇటీవలే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఫిలింఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ.. “నేను తప్పుడు పురుషులను మాత్రమే ప్రేమించాను. ఒక్కసారి కాదు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేశాను. నేను ఎందుకు ఇలా చేశాను అని ఆలోచించాను. తప్పులు చేసిన వ్యక్తులను మాత్రమే నేను ప్రేమించాను. ఆ తర్వాత నా తప్పును గ్రహించాను. ఇకపై అలాంటి మిస్టేక్ చేయకూడదని అనుకున్నాను. నేను గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను. ప్రస్తుతం మరొకరిని ప్రేమించడం.. లేదా ఎవరితోనా బంధాన్ని కలుపుకునే మానసిక స్థితిలో మాత్రం లేను. చెడు సంబంధాలలో ఉన్నప్పటికీ నేనెప్పుడు ప్రేమపై నమ్మకం కోల్పోలేదు. నన్ను అర్థం చేసుకునే.. నాతో నిజాయితీగా ఉండే భాగస్వామిని ఇప్పటికీ నేను కనుగొంటాను. నేను చాలా ఎమోషనల్ పర్సన్. కలలు, ఆశయాలు, అభిరుచి ఉన్నవారితో కలిసి ఉండాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments