Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedTollywood: లవ్‌లీ మూవీ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్

Tollywood: లవ్‌లీ మూవీ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్

Tollywood: లవ్‌లీ మూవీ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్

తెలుగు అమ్మాయిలే కాదు.. బీ-టౌన్ బ్యూటీలు, కేరళ కుట్టీలు, కన్నడ కస్తూరీలతో తమిళ పొన్నులకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఛాన్స్‌లు ఇచ్చింది. అలా తెలుగు సినిమాల్లో అవకాశాలు పొంది.. తమ సత్తా చాటినవారిలో ఒకరు శాన్వీ శ్రీవాత్సవ. ఈ అందాల భామ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టింది. శాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. ఆమె అక్క విదిశ శ్రీవాత్సవ పలు సినిమాల్లో నటిగా నటించింది. 2012లో లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శాన్వీ శ్రీవాత్సవ. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. గ్లామరస్‌గా నటించడమే కాకుండా.. చబ్బీ, చబ్బీగా ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడంతో.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకోవడమే కాకుండా.. పక్కింటమ్మాయిలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సుశాంత్ సరసన ‘అడ్డా’ సినిమాలో నటించింది.

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు తన చదువును కూడా కొనసాగించింది ఈ బ్యూటీ. తెలుగులో శాన్వీ చివరిగా ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించింది. ఇక కన్నడంలో ‘చంద్రలేఖ’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత శాండిల్‌వుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ కన్నడ కస్తూరి. ‘మాస్టర్ పీస్’, ‘భలే జోడీ’, ‘సుందరంగా జానా’, ‘సహేబా’, ‘అవనే శ్రీమన్నారాయణ’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది శాన్వీ శ్రీవాత్సవ.

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

2014 తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించిన శాన్వీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. లవ్‌లీ సినిమా టైంలో చబ్బీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత హాట్‌గా దర్శనమిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందాల హద్దులు చెరిపేసి మరీ.. గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. కాగా, ప్రస్తుతం శాన్వీ శ్రీవాత్సవ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కన్నడంలో ‘త్రిశూలం’, మరాఠీలో ‘రాంతీ’ అనే సినిమా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shanvi Srivastava (@shanvisri)

 

View this post on Instagram

 

A post shared by Shanvi Srivastava (@shanvisri)

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments