Tollywood: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తోన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న హీరోయిన్.. ఏడాదికే విడాకులు..

0
19
Tollywood: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తోన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న హీరోయిన్.. ఏడాదికే విడాకులు..

Tollywood: ప్రియురాలితో ఎంజాయ్ చేస్తోన్న భర్త.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్న హీరోయిన్.. ఏడాదికే విడాకులు..

ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఒకవైపు ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. విడిపోయాం.. విడాకులు తీసుకున్నామంటూ మరో జంట ప్రకటిస్తుంది. పెళ్లైన హీరోలతో హీరోయిన్ ప్రేమాయణం, అరరె లవ్ బర్డ్స్ బ్రేకప్.. ఇలా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు. తమ మాజీ పార్టర్న్స్ మరో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే.. అసలు నో మ్యారేజ్ అంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. నిజానికి బుల్లితెరపై ఆమె ఫైర్ బ్రాండ్. యూత్ లో యమ ఫాలోయింగ్ ఉంటుంది. పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్.. నటనలోనే కాదూ.. చూపులతోనే భయపెట్టించే నటి. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. రంగుల ప్రపంచంలో స్టార్ నటిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే పర్సనల్ లైఫ్ లో షాక్ తగిలింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి.. అతడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ చలించలేదు. విడాకుల తర్వాత ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. తనే జెన్నిఫర్ వింగెట్. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు.. కానీ మాయ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా మాయ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ పాత్రలో జెన్నిఫర్ స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్, మేనరిజం చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. బేహద్ సీరియల్లో ఆమె చేసిన పాత్రను జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు.

హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ మాత్రం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జెన్నిఫర్ ను భర్త మోసం చేశాడని.. అతడికి మరో నటితో రిలేషన్ లో ఉన్నాడని తెలిసింది. తన భర్త ప్రియురాలితో సరదాగా మాట్లాడుతుండగా.. అతడిని అందరి ముందు సెట్ లో కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యిందట. దీంతో 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here