Saturday, December 28, 2024
Google search engine
HomeUncategorizedTollywood: పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? పాన్ ఇండియా మూవీతో...

Tollywood: పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు

పై ఫొటోలో పోస్ట్ మాస్టర్ గా, అలాగే ముఖానికి కర్చీఫ్ కట్టుకుని కొత్తగా కనిపిస్తోన్న టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ ట్యాలెంటెండ్ హీరోల్లో ఇతను కూడా ఒకడు. మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే క్రేజ్ బాగా పెరిగిపోవడంతో తన దగ్గరకు వచ్చిన సినిమాలన్నీ చేసేశాడు. ఫలితంగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డాడు. ఒకానొక దశలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ అతని పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ఇందులో ఈ హీరో కాస్త డిఫరెంట్ గా కొత్త లుక్ లో కనిపించాడు. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? లేక మమ్మల్నే చెప్పేయమంటారా? ఈ పోస్ట్ మాస్టర్ మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరో కిరణ్ అబ్బవరం.

సోమవారం (జులై 15) కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ సినిమా ‘క’ నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.’నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..’ అనే డైలాగ్ తో సాగే ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్? పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటేంటి? నువ్వు మనిషివి కాదు.. తోడేలు’ అనే డైలాగులు సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ అంశాలు కూడా కిరణ్ గత చిత్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూస్తుంటే ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ మూవీలా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.

కాగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ‘క’ సినిమాకు సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు పనిచస్తున్నారు. ఈ మూవీని ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం ‘ క’ మూవీ టీజర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments