Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedTollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు...

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

Tollywood: నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా మారిపోయిన ఆర్జీవీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా దర్శనమిస్తోన్న ఈ అందాల తారను గుర్తు పట్టారా? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ సొగసరి పలువురి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తన కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ మూవీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చిఅందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ కాళీ మాతను గుర్తు పట్టారా? ఈమె మరెవరో కాదు ‘భూమ్ బద్దలు’ పాటతో కుర్రకారును హుషారెత్తించిన అప్సరా రాణి. సోమవారం (జులై 01) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అరాచకం నుంచి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, నెత్తురితో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే అప్సరా రాణి ఇలా మారిపోయిందేంటా? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాచరికం సినిమాలో అప్సరా రాణితో పాటు విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో హైపర్ ఆది, మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, మెంబూబ్ బాషా, పాచి థాకర్, రూపేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంగి సంగీతం అందిస్తుండగా, ఆర్య సాయి కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాచరికం సినిమాలో అప్సరా రాణి..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

అప్సరా రాణి లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments