ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఒక స్టార్ నటుడి భార్య పిల్లలు వీరు. అయితే ఆ స్టార్ నటుడు ఇప్పుడు ఈ భూమ్మీద లేడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆ నటుడు సుమారు పదేళ్ల క్రితం హఠాత్తుగా కన్నుమూశాడు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్నే విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అయినా తన సినిమాలు, పాత్రలతో ఇంకా మన మధ్యనే జీవిస్తూ ఉన్నాడు. నటుడిగా కంటే తన వ్యక్తిత్వంతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆ నటుడి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇందులో ఉన్నది మరెవరో కాదు దివంగత టాలీవుడ్ నటుడు శ్రీహరి, అతని భార్య పిల్లలు. శ్రీహరి 2013లో ఆరోగ్య సమస్యలతో మరణించారు. శ్రీహరి – డిస్కోశాంతికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. పెద్ద కొడుకు శశాంక్ శ్రీహరి డైరెక్టర్ గా రాణిస్తుంటే.. రెండో కొడుకు మేఘామ్ష్ శ్రీహరి మాత్రం హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పటికే రాజ్ దూత్ సినిమాతో అభిమానులను మెప్పించాడీ హ్యాండ్సమ్ హీరో. ఇప్పుడు మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇవి కూడా చదవండి
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేఘామ్ష్ శ్రీహరి తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక పాత ఫొటోను అందులో పంచుకున్నాడు. ఇందులో దివంగత శ్రీహరి, డిస్కో శాంతితో పాటు వారి కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక శ్రీహరి విషయానికి వస్తే.. తెలుగులో విలన్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత హీరోగానూ రాణించారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. అయితే 2013లో రాంబో రాజ్‌కుమార్ అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న ముంబై లో శ్రీహరి కన్నుమూశారు.
భార్య పిల్లలతో దివంగత నటుడు శ్రీహరి..
మంచు మనోజ్ తో శ్రీహరి తనయుడు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.