Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‏గా మారిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

0
26
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‏గా మారిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‏గా మారిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది ఓ హీరోయిన్. అందం, అభినయంతోపాటు సంప్రదాయంగా కనిపించి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్ద కాలంపాటు సినిమాల్లో అలరించిన ఆ తార ఇప్పటికీ సింగిల్. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలం సినిమాలకు దూరమై ఆ బ్యూటీ.. ఇప్పుడు ఫుల్ టైమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా సెటిల్ అయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ సదా. 2003లో నితిన్ హీరోగా పరిచయమైన జయం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

తెలుగు, కన్నడ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. హోమ్లీ లుక్, అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాలో సదా కథానాయికగా నటించగా.. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్న సదా ఖాతాలో నెమ్మదిగా డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో సదాకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సదా.. కొన్నాళ్లుగా బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా సదా ఇన్ స్టాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కనిపిస్తున్నాయి. అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షులను అందంగా ఫోటోస్, వీడియోస్ తీస్తూ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. సదా చేసిన పోస్టులకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అందమైన అమ్మాయి పులులు, సింహాలను అంతే అందంగా కెమెరాలో బంధిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని.. తన ఫ్రీడమ్ ను పోగొట్టుకోవాలని లేదని.. నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు దొరకలేదని.. అందుకే పెళ్లి అనే ఆలోచన రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sadha Sayed (@sadaa17)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here