Tollywood: ఈ నటీమణి భర్త.. ప్రముఖ దర్శకుడు, నటుడని మీకు తెల్సా..?

0
14
ఈ నటి భర్త ఎవరో తెల్సా.. ప్రముఖ డైరెక్టర్

తెలుగు సినిమా, సీరియల్ ఫీల్డ్స్‌లో నటీనటులు, దర్శకులు-ఆర్టిసులు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు. వారిలో కొందరు మాత్రమే మనకు తెలుసు.. ఇంకొందరు తమ పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ గోప్యంగా ఉంచుతారు.  వారిలో మీనాకుమారి ఒకరు. ఆమె సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగు లోగిళ్లకు సుపరిచితమే. ఆమె భర్త.. ప్రముఖ దర్శకుడు, నటుడు అని మీకు తెల్సా..?. అవనండీ.. చి.ల.సౌ.స్రవంతి సీరియల్‌ ద్వారా మీనా కుమారి బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్‌కు అప్పట్లో ఓ రేంజ్‌ ఫాలోయింగ్ ఉండేది. ఈ నటీమణిని కూడా తెలుగింటి మహిళలు బాగా అభిమానించేవారు. అలా సీరియల్స్‌లో బాగా పాపులర్ అయిన మీనాకుమారి.. ఆ తర్వాత సినిమాల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.

అయితే సీరియల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సమయంలోనే..  తన మొదటి సీరియల్ దర్శకుడు పులి వాసుతో ప్రేమలో పడింది మీనా. కొంతకాలం డేటింగ్ చేసిన వీరద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పులి వాసు.. శ్రీమతి కళ్యాణం, మంచుపల్లకీ, చి.ల.సౌ స్రవంతి.. సీరియల్స్ డైరెక్ట్ చేశారు. వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా సూపర్ మచ్చి అనే మూవీ తీశారు. ఈ సినిమా సో.. సోగా ఆడింది. మరోవైపు నటుడిగాను.. తన మార్క్ చూపూ ప్రయత్నం చేశారు పులి వాసు.  సుబ్బూ, రాజా, సంకల్పం వంటి సినిమాల్లో పాత్రలు పోషించారు. రూపాయి అనే సినిమాతో హీరోగానూ మారారు. తాజాగా ఆయన దర్శకుడిగా మరో సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here