Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedTollywood: ఈ తొర్రి పళ్ల పాప క్రేజీ హీరోయిన్.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరోతో పెళ్లి.....

Tollywood: ఈ తొర్రి పళ్ల పాప క్రేజీ హీరోయిన్.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరోతో పెళ్లి.. గుర్తు పట్టారా?

పై ఫొటోలోని తొర్రిపళ్ల పాపను గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. అయితే సినిమా కెరీర్ పీక్స లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను పెళ్లి చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడంటే మూడే సినిమాల్లో నటించింది. అందులోనూ ఆమెకు గుర్తింపు తెచ్చింది ఒక్క మూవీనే. ఇంతకు ఆ తొర్రిపళ్ల పాపను గుర్తు పట్టారా? కష్టంగా ఉందా?అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ చిన్నారి ఎవరంటే’ వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ అంటూ కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ మంజిమా మోహన్. నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో మూవీలో లీల పాత్రలో మెరిసింది మంజిమా మోహన్. ఇందులో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. దీంతో మంజిమా హీరోయిన్ గా బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

నాగ చైతన్య సినిమా తర్వాత కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో మాత్రమే నటించింది మంజిమా మోహన్. ఈ సినిమాల్లో నారా భువనేశ్వరి పాత్రను ఆమె పోషించింది. మలయాళం, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన ఆమె
2022లో ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు.. హీరో గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మంజిమా మోహన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో మంజిమా మోహన్, కార్తీక్ కలసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం మొదలైంది. అది కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇరు పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

భర్త గౌతమ్ కార్తీక్ తో నటి మంజిమా మోహన్..

పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు మంజిమా మోహన్. ఇక ఆమె భర్త కార్తీక్ మాత్రం అడపా దడపా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమాతో కార్తీక్ తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments