Tollywood: ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి.. అబ్బాయిలతో కలిసి గదిలో అద్దెకు.. ఒక్క సినిమాతోనే సెన్సెషన్..

0
26
ఇంటి నుంచి పారిపోయి అబ్బాయిలతో కలిసి గదిలో అద్దెకు..

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. నటీనటులగా ఎదగాలని.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు చాలా మంది. ఇందులో కొందరు ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. కానీ ఆ గుర్తింపు ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోతారు. ముఖ్యంగా హీరోయిన్స్ తొలి సినిమాతోనే అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను దొచుకుని.. ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి కనుమరుగైపోతుంటారు. ఒకటి రెండు చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ అవకాశాలు అంతగా సంపాదించుకోలేకపోతారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత మెయిన్ లీడ్ రోల్స్ కాకుండా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే సినిమా ఎంపిక పొరపాట్లతో ఆఫర్స్ అంతగా అందుకోలేకపోయింది. సినిమాల్లో అవకాశాల కోసమే ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..? తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే.

షాలిని పాండే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. షాలిని ఇంజనీర్‌ కావాలని ఆమె తండ్రి కోరిక. కానీ నటనపై ఆసక్తి కలగడంతో ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుంది. ఇందుకు ఇంటిని వదిలి వచ్చేసింది. గతంలో ఓ మీడియా ఈవెంట్లో షాలిని మాట్లాడుతూ.. “నాన్న నన్ను ఇంజనీర్‌ని చేయాలనుకున్నారు. నేను కూడా ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఆ తర్వాత నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగింది. కానీ అందుకు నాన్న అంగీకరించలేదు. దాదాపు 4 సంవత్సరాలు మా నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించాను. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. అందుకే ఇల్లు వదిలి వచ్చేశాను. ముంబై వచ్చిన తర్వాత కొందరు స్నేహితులు ఉండేవారు. కానీ కొన్ని కారణాల వల్ల అబ్బాయిలతో కలిసి గదిలో అద్దెకు ఉండాల్సి వచ్చింది. ఆ అబ్బాయిలే నా కుటుంబంగా మారి.. సినిమాల్లో నటించేందుకు నాకు సాయం చేశారు. ఇప్పటికీ వారందరితో నాకు మంచి స్నేహం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే మహానటి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, 118, గొరిల్లా, ఇద్దరి లోకం ఒకటే, బాంఫాడ్, నిశ్శబ్బంద, సైలెన్స్ వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన మహారాజ్ చిత్రంలోనూ నటించింది. ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here