ఆర్పీ పట్నాయక్.. ఎంత సూపర్ మ్యూజిక్ డైరెక్టరో.. అంతే స్థాయి యాక్టర్ కూడా.. ఆయన లీడ్ రోల్‌లో 2004 లో వచ్చిన గ్రేట్ ఫిల్మ్ శీను వాసంతి లక్ష్మి. ఈ సినిమాను జనాలు బాగా ఆదరించారు. విమర్శకులు ప్రశంసలు కూడా దక్కాయి. వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ మూవీ నుంచి ప్రేరణ పొంది ఈ మూవీ తీశారు. ఈ సినిమాలో ఆర్పీ పట్నాయక్ కనిపించి.. తన అమాయకపు నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రదారి శ్రీను సోదరి స్రవంతి రోల్‌లో పద్మ ప్రియ జానకిరామన్ అనే నటి కనిపించింది. ఆమెకు ఇదే ఫస్ట్ సినిమా. మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించిన పద్మ ప్రియ.. ప్రేక్షకులను మెప్పించి.. ప్రశంసలు అందుకున్నారు.
కానీ ఆ తర్వాత ఈ నటీమణికి తెలుగునాట పెద్దగా చాన్సులు రాలేదు. 2010లో రిలీజైన శర్వానంద్ చిత్రం అందరి బంధువయ, 2017లో జగపతి బాబు ప్రధాన పాత్రలో వచ్చి వచ్చిన పటేల్ సర్ సినిమాల్లో మాత్రమే కనిపించింది ప్రియ. అలాగని ఆమె ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లలేదు. ఇతర భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ చేశారు. 2017 నుంచి 2021 వరకు నటనకు కాస్త విరామిచ్చారు. 2022లో వండర్ విమెన్ అనే ఇంగ్లీష్ మూవీలో కనిపించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.
శీను వాసంతి లక్ష్మి చిత్రం వచ్చి రెండు దశాబ్ధాలు దాటుతున్నా.. అదే చార్మింగ్‌తో ఉన్నారు పద్మప్రియ. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు స్టన్ అవుతన్నారు. చెప్పడం మర్చిపోయాం.. పద్మప్రియకు సాంప్రదాయ నృత్యంపై మంచి పట్టు ఉంది. అలానే పుస్తక పఠనం అంటే కూడా మంచి ఆసక్తి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. తన ఇంటి పెరట్లో.. రకరకాల మొక్కలు పెంచే ఈ నటీమణి.. ప్రస్తుతం తనకు ఇష్టమైనట్లుగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.