Tollywood: అయ్య బాబోయ్! టాలీవుడ్ హీరో ఇలా మారిపోయాడేంటి? షాక్‌లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా?

0
16
అయ్య బాబోయ్! టాలీవుడ్ హీరో ఇలా మారిపోయాడేంటి?ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో వృద్ధుడి గెటప్ లో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఓ టాలీవుడ్ హీరో. అయితే తన లేటెస్ట్ సినిమా కోసం ఉన్నట్లుండి ఇలా ముసలాడిలా మారిపోయాడు. వీటిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలీ గెటప్ ఫేస్ యాప్ ద్వారా క్రియేట్ చేశారా? లేదా మూవీలోనే ఇలా కనిపిస్తారా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఈ హీరో మేకోవర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మొదట చాలా మంది ఈ హీరోను గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత తేరుకుని తమ అభిమాన హీరో ఇలా మారిపోయాడేంటి? అని నోరెళ్ల బెడుతున్నారు. మరి మీరైనా ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఇతను మరెవరో కాదు యూత్ స్టార్ నితిన్. ప్రస్తుతం అతను వెండీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఎక్స్‌ ట్రార్డీనరి మ్యాన్ తర్వాత మరోసారి నితిన్ తో జోడీ కడుతోంది శ్రీలీల. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అలా తాజాగా ఈ మూవీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో హీరో నితిన్‌ వృద్ధుడి గెటప్‌లో ఉన్నాడు. ముసలాడిలా కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. మరోవైపు శ్రీలీల కూడా వృద్ధురాలిగా కనిపించడం గమనార్హం. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన డైరెక్టర్ వెంకీ కుడుముల ‘ రాబిన్ హుడ్ 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటాడు’ అని కామెంట్ చేశాడు. అయితే ఈ ముసలాడి గెటప్ లు ఫేస్ యాప్ ద్వారాచేశారా? లేదా సినిమాలోనే ఇలా కనిపిస్తారా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వీటిని చూసిన ఫ్యాన్స్ ‘ అయ్య బాబోయ్.. నితిన్ ఏంటి ఇలా మారిపోయాడు’? అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా భీష్మ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా భీష్మ తర్వాత ఆ రేంజ్ స్థాయి హిట్ పడలేదు హీరో నితిన్ కు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డీనరి మ్యాన్ సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో మరోసారి తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు నితిన్. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here