Tollywood: వృద్ధాప్యాన్ని చూడలేను.. మరణాన్ని ముందే ఊహించిన స్టార్ హీరో..

0
18
ఆ హీరో కుటుంబంలో ఎవరూ 50 ఏళ్లకు మించి బతకలేదు..

సినీపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరో. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే గుండెపోటుతో 47 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. నిజానికి ఆ హీరో కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బతకలేదు. ఆ హీరో సంజీవ్ కుమార్. 70, 80’s కాలంలో ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరో. ‘మౌసమ్’, ‘నౌకర్’, ‘నయా దిన్ నై రాత్’, ‘పతి-పత్నీ ఔర్ వో’, ‘అంగూర్’ ‘షోలే’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో తనదైన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, ఇతరులు వంటి సూపర్ స్టార్లు ఆధిపత్యం చెలాయించిన కాలంలో, సంజీవ్ కుమార్ తన వయస్సును ధిక్కరించే పాత్రలను పోషించడం ద్వారా ప్రత్యేకంగా నిలిచాడు. కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడు పోషించిన పాత్రలను సినీ ప్రియులు మర్చిపోలేరు. తన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో గుర్తుండిపోయారు.

అంతేకాదు.. అప్పట్లో అత్యధిక పారితోషికం పొందిన నటుడు కూడా సంజీవ్ కుమార్ కావడం గమనార్హం. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజీవ్ కుమార్‏ను ఉద్దేశిస్తూ.. చాలా సినిమాల్లో మీ వయసుకు మించిన పెద్ద పాత్రలు పోషిస్తున్నారు..ఎందుకు ? అని అడగ్గా.. ఈ ప్రశ్నకు సంజీవ్ కుమార్ చెప్పిన ఆన్సర్ అక్కడుకున్నవారిని ఆశ్చర్యపరిచింది. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ‘ఎందుకంటే నా వృద్ధాప్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను. అందుకే వృద్ధాప్య వయసును తెరపై ప్లే చేస్తూ అనుభవిస్తున్నాను’ అని అన్నారు. నిజానికి సంజీవ్ కుమార్ ఇంట్లో ఏ వ్యక్తి కూడా 50 ఏళ్లు దాటి జీవించలేదు. ఇక సంజీవ్ కుమార్ కూడా 50 ఏళ్లలోపే తాను ఈ లోకాన్ని విడిచిపెడతానని గ్రహించాడు. ఇక ఈ మాట ప్రకారమే 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు.

గుండెపోటు వచ్చిన తర్వాత సంజీవ్ కుమార్ కు గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే 1985 నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించాడు. మరణానికి ముందు తాను వృద్ధాప్యాన్ని చూడలేను అని సంజీవ్ కుమార్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. సంజీవ్ కుమార్ తాత, తండ్రి, తమ్ముడు నికుల్ తో సహా అతడి కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే మరణించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here