Tollywood: రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ.. బర్త్ డే రోజునే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందిగా..

0
24
రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ..

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు విమర్శలు ఎన్ని వచ్చినా ఈషోకు మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు.. పాపులారిటీ పెంచుకోవాలని అనుకునేవాళ్లు చాలా మంది ఈ షోలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చాకా మాత్రం సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. బిగ్‏బాస్ షోకు ముందు హీరోగా ఉన్నవారు జీరోగా.. అసలు జనాలకు పరిచయమే లేని వాళ్లు హీరోలుగా మారుతుంటారు. కానీ చాలా మంది బిగ్‏బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 7లో పాల్గొన్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా వచ్చింది. అంతేకాదు.. వచ్చిరానీ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ స్టాలో తెగ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగింది. తన బర్త్ డే సందర్బంగా కొత్త బిజినెస్ స్టా్ర్ట్ చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా..? తనే బిగ్‏బాస్ ఫేమ్ శుభ శ్రీ రాయగురు.

బిగ్‏బాస్ సీజన్ 7లో అడుగుపెట్టి తన ఆట తీరుతో కట్టిపడేసింది శుభ శ్రీ రాయగురు. అబ్బాయిలకు ధీటుగా అన్ని ఆటలలోనూ గెలిచింది. అలాగే వచ్చిరానీ తెలుగులో మాట్లాడుతూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. బిగ్‏బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇన్ స్టాలో ఫోటోషూట్స్, రీల్స్ అంటూ సందడి చేస్తుంది.

ఈరోజు శుభ శ్రీ రాయగురు పుట్టినరోజు. ఈ సందర్బంగా శుభశ్రీ తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తాజాగా తను శుభశ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించినట్లు తెలిపింది. అంతేకాకుండా కమర్షియల్ బిల్డింగ్స్, విల్లా, ఇల్లు, ప్లాట్స్ కొనాలనుకుంటే శుభశ్రీ హోమ్స్ సంప్రదించాలంటూ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శుభ శ్రీ షేర్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. బిగ్‏బాస్ సెలబ్రెటీస్, అభిమానులు శుభశ్రీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. శుభశ్రీ ఒడిశాకు చెందిన అమ్మాయి. న్యాయవిద్యను కంప్లీ్ట్ చేసిన శుభశ్రీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. 2022లో రుద్రవీణ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బిగ్‏బాస్ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here