Tollywood: పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను ఏలేసిన స్టార్ హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే.. ఎవరో తెలుసా..?

0
28
Tollywood: పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను ఏలేసిన స్టార్ హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే.. ఎవరో తెలుసా..?

Tollywood: పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను ఏలేసిన స్టార్ హీరో.. తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవరే.. ఎవరో తెలుసా..?

మాస్, యాక్షన్ చిత్రాలకు అతడు కేరాఫ్ అడ్రస్. ఒక్క సినిమాతోనే ప్రపంచ సినిమానే తనవైపు తిరిగి చూసేలా చేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆ కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. యాక్టింగ్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. టాప్ హీరోగా కొడుకు ఇండస్ట్రీని ఏలేస్తున్న అతడి తండ్రి మాత్రం ఇప్పటికీ బస్ డ్రైవర్ గానే వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? అతడు మరెవరో కాదు.. కన్నడ రాకింక్ స్టార్ యశ్. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు.

2008లో మోహిన మనసు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు దాదాపు 21 చిత్రాల్లో నటించాడు. 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ మూవీ యశ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీతో వరల్డ్ వైడ్ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్, యశ్ యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో కన్నడలోనే కాదు..హిందీ, మలయాళం, తెలుగు, తమిళం భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి యశ్ పేరు మారుమోగింది. ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ప్రస్తుతం యశ్ వయసు 38 సంవత్సరాలు. 2004లోనే ఉత్తరాయణ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నందగోకుల సినిమాలో నటిస్తున్న సమయంలోనే హీరోయిన్ రాధిక పండిట్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here