Tollywood: తస్సాదియ్యా.! ఆమె ఈమేనా.. ఈ వయ్యారి అందానికి కేరాఫ్‌గా మారిపోయింది.. చూస్తే స్టన్

0
25
తస్సాదియ్యా.! ఆమె ఈమేనా.. ఈ వయ్యారి ఏంటిలా మారిపోయింది..

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈమే మలయాళ కుట్టి.. కానీ తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తోంది. ఈ అమ్మడి తండ్రి ఓ సినిమాటోగ్రాఫర్.. తండ్రిలా మారడమో లేదా డైరెక్టర్ అవ్వడమో కలగా పెట్టుకున్న ఈ బ్యూటీ.. అనుకోకుండా హీరోయిన్ అయింది. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ వయ్యారి. ఇప్పటికైనా ఆమె ఎవరో కనిపెట్టారా.? మరెవరో కాదండీ.. మాళవిక మోహనన్.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రాఫర్‌ యుకె మోహనన్ కూతురు మాళవిక మోహనన్. ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియా చేసిన ఈ బ్యూటీ.. మమ్ముట్టీతో యాడ్ షూట్‌కి వెళ్లి.. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘పట్టామ్ పోల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కన్నడంలో ‘నన్ను మట్టు వరలక్ష్మీ’.. హిందీలో ‘బీయాండ్ ది క్లౌడ్స్’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాల అనంతరం ‘ది గ్రేట్ ఫాదర్’, ‘పేట’, ‘మాస్టర్’, ‘మారన్’ సినిమాల్లో నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

2013లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. మంచి పాత్రలను ఎంచుకుంటూ.. ఆచితూచి ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఈమె విక్రమ్ సరసన తంగలాన్.. తెలుగులో ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘రాజా సాబ్’ లాంటి బడా చిత్రాల్లో నటిస్తోంది. కాగా, ఆమె గ్లామరస్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here