Tollywood: ఒక్కప్పటి స్టార్ హీరో కూతురు.. అందంగా లేదంటూ అవమానాలు.. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రశంసలు..

0
13
తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మహిళా ప్రాధాన్యత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‏గా మారింది. ఒకప్పుడు తన ముఖంపైనే అవమానించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ హీరోయిన్ తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో. కానీ ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మరణం.. ఆ తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు.. తర్వాత ఎదిగిన అన్నయ్యల మరణంపై ఆమె జీవితాన్ని మరింత కష్టంగా మార్చాయి. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇన్నాళ్లు సంప్రదాయ లుక్ లో కనిపించిన ఈ హీరోయిన్.. ఇప్పుడిప్పుడే గ్లామర్ ఫోటోలతో షాకిస్తుంది. తెలుగమ్మాయి అయినా తమిళంలోనే మంచి ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.

ఐశ్వర్య రాజేశ్.. ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు. తల్లి డ్యాన్సర్. ఐశ్వర్యకు ముగ్గురు తోబుట్టువులు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి కాలేయ వ్యాధితో మరణించాడు. తల్లికి పెద్దగా చదువు లేదు, నాన్న ప్రత్యేకంగా ఏమీ సంపాదించలేదు. దీంతో తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమను పెంచిందని చాలాసార్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నానని.. ఇప్పుడు తన సినిమాలు విడుదలవుతుంటే తన తల్లి చాలా గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడిప్పుడే తన సినిమాలకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని.. కానీ వాటిని తప్పుగా తీసుకుని తాను ఎవరినీ నిందించనని తెలిపింది.

కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికిరావని తనను ముఖం మీదే అవమానించారని.. దర్శకనిర్మాతలు అనేక కామెంట్స్ చేశారని.. కానీ ఆ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఎప్పటికైనా సినిమా ఆఫర్ వస్తుందని ప్రయత్నించానని.. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగితే నా సామర్థ్యంపై నాకున్న నమ్మకమే. ప్రతిభ ఉంది, రంగు లేదు. ప్రతిభే ఒకరి అందాన్ని వెలికితీస్తుంది. నా టాలెంట్‌తో అవకాశం రావాలనుకున్నాను. కాకముట్ట నుంచి చాలా సినిమాల్లో మేకప్ వేసుకోలేదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో తన తండ్రి పేరు చెబితే అవకాశాలు ఇవ్వరని సలహాలు ఇచ్చారని.. కానీ తన తండ్రిపేరుతోనే నటిస్తానని సినీరంగంలోకి అడుగుపెట్టానని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here