బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి దల్జీత్ కౌర్. గతంలో తెలుగులోకి డబ్ అయిన చూపులు కలిసిన శుభవేళ సీరియల్లో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత హిందీలో అనేక సీరియల్స్ చేసిన దల్జీత్ కౌర్… వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది దల్జీత్ కౌర్. నిత్యం ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుందిస. సోషల్ మీడియాలో దల్జీత్ కైర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితం గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరలవుతుంది. కొన్ని నెలల క్రితం నిఖిల్ పటేల్ అనే వ్యాపారవేత్తను రెండవ వివాహం చేసుకుంది దల్జీత్ కౌర్. అంతకు ముందు నటుడు షాలిన్ భానోట్ ను వివాహం చేసుకోగా.. వీరికి ఒక కుమారుడు జన్మించాడు.
కానీ పెళ్లైన కొన్నాళ్లకే దల్జీత్ కౌర్, షాలిన్ భానోట్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పది నెలల క్రితం కెన్యాకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌తో దల్జీత్ కైర్ భారతదేశంలో సంప్రదాయకంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి కెన్యాకు షిఫ్ట్ అయ్యింది దల్జీత్ కౌర్. కానీ వీరిద్దరి వివాహం ఎక్కువ కాలం నిలువలేదు. పెళ్లైన పది నెలలకే భర్తను వదిలేసి కొడుకుతో కలిసి ఇండియాకు చేరుకుంది దల్జీత్. అలాగే తన భర్త నిఖిల్ పటేల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. నిఖిల్ పటేల్ తనతో పెళ్లిని అంగీకరించేందుకు నిరాకరించాడని.. తనను బెదిరించాడని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది.
కొన్ని రోజుల క్రితం దల్జీత్ కౌర్, నిఖిల్ పటేల్ వైవాహిక బంధం గురించి అనేక వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. ఒక అమ్మాయి తనను తాను అద్దంలో చూసుకుంటూ ఓదార్చుకుంటూ కనిపిస్తుంది. నన్ను నేను పరిష్కరించుకున్నాను.. నన్ను నేను రక్షించుకున్నాను.. నాకు నేనున్నాను.. నాకు నేను సమయం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ రాసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.