ఫై ఫొటోలో బాన పొట్టతో.. కళ్ల జోడు పెట్టుకుని బొద్దుగా కనిపిస్తున్నదెవరో తెలుసా? ఇతను ఒకప్పుడు దక్షిణాది హ్యాండ్సమ్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. 2000వ దశకంలో కుర్రాళ్లందరూ ఈ హీరోలాగే ఉండాలనుకునేవారు. హెయిర్ స్టైల్ కానీ, దుస్తుల విషయంలో కానీ ప్రతిదీ ఈ హ్యాండ్సమ్ హీరోనే ఫాలో అయ్యేవాళ్లు. ఇక ఇతనికి ఉన్న లేడీ ఫాలోయింగ్ మరే హీరోకు ఉండేదంటే అతి శయోక్తి కాదు. ఇక యాక్టింగ్ లోనూ ఈ హీరో అదరగొట్టాడు. తన అద్భుతమైన నటనతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసే అతను పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవుతుంటాడు. అందుకు తగ్గట్టుగానే తన సినిమా కెరీర్ లో హిట్స్ అందుకున్నాడు. పై ఫొటోలోని మేకోవర్ కూడా ఒక సినిమా కోసమే. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండీ. ఈ హీరో మరెవరో కాదు.. సఖి, చెలి సినిమాలతో తెలుగు నాట తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న మ్యాడీ.. అదే నండీ మాధవన్. అతను హీరోగా నటిచండంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఇందులో వయసు మళ్లిన నంబి పాత్ర కోసం పొట్ట పెంచారు మాధవన్. భారీగా బరువు కూడా పెరిగారు. పై ఫొటో అదే.
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమా షూటింగ్ సమయంలో బరువు పెరిగిన ఫొటోలను, బరువు తగ్గిన తర్వాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మాధవన్. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు
నంబి పాత్ర కోసం మాధవన్ మారిన తీరును తెగ మెచ్చుకుంటున్నారు. అయితే నంబీ సినిమా కోసం బొద్దులా మారిన మాధవన్ మళ్లీ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయాడు. అది కూడా కేవలం మూడు వారాల్లో. దీనికి సంబంధించిన వివరాలను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు మ్యాడీ. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఫస్ట్ ఇన్నింగ్‌లో హీరోగా అలరించిన మాధవన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గానూ అదరగొడతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘అమ్రిక్ పండిట్’, ‘అదృష్టశాలి’, ‘టెస్ట్’, ‘శంకర’, ‘దే దే ప్యార్‌దే 2’ తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
ఇవి కూడా చదవండి
Intermittent fasting, heavy chewing of food 45-60 times( drink your food and chew your water) .. last meal at 6.45 pm .( only cooked food -nothing raw AT ALL post 3 pm ) .. early morning long walks and early night deep sleep( no screen time 90 min before bed) … plenty of fluids… https://t.co/CsVL98aGEj
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.