Tiger Shroff: యాక్సిడెంట్‌తో మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో.. అభిమానుల ప్రశంసలు

0
37
మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో

బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ ష్రాఫ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ వారసుడిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతను అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడీ హ్యాండ్సమ్ హీరో. గతేడాది గణ్ పత్ సినిమాలో ప్రేక్షకులను పలకరించిన టైగర్ ఈ ఏడాది బడే మియా.. చోటా మియా సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు టైగర్ కు నిరాశే మిగిల్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ కండల హీరో తన మంచి మనసును చాటుకున్నాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ పంచాన పడిన ఓ మూవీ టెక్నీషియన్ కు ఆర్థిక సాయం చేశాడు. తన తొలి సినిమా హీరో పంతికి రవి కుమార్ ఫోకస్ ఫుల్లర్ (అసిస్టెంట్ కెమెరామెన్) గా పని చేశాడు. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడిన అతను సుమారు ఎనిమిది నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. దాచుకున్న డబ్బంతా చికిత్సకే సరిపోయింది. దీంతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. అయితే రవి కుమార్ దీన స్థితి గురించి తెలుసుకున్న టైగర్ ష్రాఫ్ అతని చికిత్సకు, అలాగే ఆర్థిక అవసరాలకు సరిపడా డబ్బును సమకూర్చాడు. ఈ సహాయం లక్షల్లోనే ఉన్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

టైగర్ ష్రాఫ్ చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన అభిమానులు, నెటిజన్లు టైగర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై రవి కుమార్‌ మాట్లాడుతూ.. ‘టైగర్‌ ష్రాఫ్‌ తండ్రి జాకీ ష్రాఫ్‌తో మా అన్న ప్రసాద్‌ కలిసి పని చేశాడు. 1942: ఎ లవ్‌ స్టోరీ సినిమా షూటింగ్‌ సమయంలో మా అన్న చేయికి తీవ్ర గాయమైంది. అప్పుడు జాకీ సార్ మా అన్న ఆపరేషన్‌కు సాయం చేశాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాకు చాలా పెద్ద సాయం చేశాడు. నేను టైగర్ నటించిన హీరో పంటి సినిమాకు పని చేశాను. ఈ విషయం బహుశా తనకు గుర్తుండకపోవచ్చు. అయినా తాను పెద్ద మనసుతో నన్ను ఆదుకున్నాడు. టైగర్‌ తల్లి ఆయేషా ష్రాఫ్‌ నాకు మంగళవారం ఫోన్‌ చేసి మాట్లాడింది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బడే మియా.. చోటే మియా ప్రమోషన్లలో అక్షయ్ కుమార్ తో టైగర్ ష్రాఫ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here