Thangalaan Trailer : అదరగొట్టిన విక్రమ్.. ఎట్టకేలకు తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది..

0
36
అదరగొట్టిన విక్రమ్.. ఎట్టకేలకు తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది..

చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు. విక్రమ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమానుంచి ట్రైలర్ విడుదలైంది. సినిమా ట్రైలర్ మిస్టీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది, ఇప్పుడు ఈ ఆసక్తికరమైన ట్రైలర్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ లో చియాన్ విక్రమ్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు విక్రమ్. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. సర్పత్త పరంబరై, కబాలి, కాలా వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్ మరోసారి విభిన్నమైన, విలక్షణమైన చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ చూశాక సినిమాలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగింది.

అయితే సినిమా కథ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KFG)  చరిత్ర గురించి ఉంటుంది. 200 సంవత్సరాల క్రితం, బ్రిటీష్ వాళ్లు కోలార్ బంగారు గని క్షేత్రాన్ని కనుగొన్నారు. దానిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో జరిగిన కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్. టీజర్ తంగలాన్ పై ఆసక్తిని కలిగించాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తంగలాన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ తోనే భయపెట్టించారు మేకర్స్. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. 2024 ఆగస్టు 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా . మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here