విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ప్రమోషన్స్ రీస్టార్ట్ చేసిన మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ తంగలాన్ మీద అనుకున్న రేంజ్ బజ్ క్రియేట్ చేసిందా..?
విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
బ్రిటీష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ ఫీల్డ్స్‌లో పనిచేసే కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు పా రంజిత్. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు దర్శకుడు, నటీనటులు పడిన కష్టం ట్రైలర్లో కనిపించింది.
ముఖ్యంగా టైటిల్ రోల్లో విక్రమ్ పెర్ఫామెన్స్ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఓవరాల్‌గా ట్రైలర్‌తో కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
అయితే ప్రజెంట్ మాస్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో తంగలాన్ ఆయడిన్స్‌ను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.