పోలీసుల విచారణకు శ్రీ రెడ్డి

యాంకర్, యూట్యూబర్ శ్రీ రెడ్డి ఏపీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లాలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను అసభ్యకరంగా దూషిస్తూ పోస్టులు చేసినట్లు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కోసం విజయనగరం వెళ్లి విచారణకు హాజరైంది శ్రీరెడ్డి. ఆమెకు కనీసం ఏడేళ్ల శిక్ష పడేలా సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమెకు నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు రావాల్సిఉంటుందని చెప్పారు.

వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని, రామ్ గోపాల్ వర్మ, శ్యామల, శ్రీరెడ్డి వంటి వారు టీడీపీ జనసేన నాయకులపై విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు చేశారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే శ్రీరెడ్డి క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. కానీ ఆయా పాార్టీల, నాయకుల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కంప్లైంట్స్ ఇస్తూ వస్తున్నారు.