దుబాయ్ లో యంగ్ టైగర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్‌ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. తనకు వచ్చిన ఇమేజ్ కు తగ్గట్టుగానే కొరటాల ఈ సినిమాను భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ లోనూ మూవీ షూటింగ్ జరిగింది. ఫుల్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీన్స్ ఇటీవల పూర్తయ్యాయట.

షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ దుబాయి ట్రిప్ కి వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు ఆయన ఈ దుబాయి ట్రిప్ కి వెళ్లారు. ఆయన ట్రిప్ పూర్తయిన తర్వాత మళ్లీ దేవర షెడ్యూల్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ దుబాయి వెళ్తుండగా ఎయిర్ పోర్టులో కెమేరా మెన్ కి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా సింపుల్ గా బ్లూ జీన్స్ బ్లాక్ టీషర్ట్ ధరించి కనిపించారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.