ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో

కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తన ప్రేయసి కీర్తి పాండియన్ ను వివాహం చేసుకున్నారు. కీర్తి పాండియన్ నిన్నటితరం నటుడు అరుణ్ పాండియన్ కూతురు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న అశోక్, కీర్తి..పెద్దల అంగీకారంతో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు.

ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ వీరి వివాహానికి హాజరయ్యారు. అశోక్, కీర్తి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నూతన జంటకు నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కోలీవుడ్ లో ఓ మై కడవులే సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నారు అశోక్ సెల్వన్. ఈ సినిమా తెలుగులో విశ్వక్ సేన్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో ఓరి దేవుడా పేరుతో రీమేక్ అయ్యింది.

ఇక తెలుగులో నిన్నిలా నిన్నిలా సినిమాలో నటించిన అశోక్ సెల్వన్…విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తుతం అశోక్ సెల్వన్ కోలీవుడ్ లో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.