యశ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడంతో వలన పోస్ట్ పోన్ అయ్యింది. ఇటీవల ముంబాయిలో ఓ షెడ్యూల్ షూటింగ్ జరిగింది కానీ.. అది అనుకున్న విధంగా రాకపోవడంతో రీషూట్ చేయాలి అనుకుంటున్నారట. ఇలా షూటింగ్ ఆలస్యం అవుతుండడం వలనే సమ్మర్ లో రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనేది లేటెస్ట్ ప్లాన్. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ టాక్సిక్ బాగానే ఉంది కానీ.. ఆశించినంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే టాక్ వచ్చింది. దీంతో మరింత కేర్ తీసుకుంటున్నాడట రాకీ భాయ్
రాకీ భాయ్ ఓ వైపు టాక్సిక్ మూవీ చేస్తూనే.. మరో వైపు రామాయణం మూవీలో రావణుడుగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలో ఇంటర్నేషనల్ గా క్రేజ్ సంపాదించాలి అనుకుంటున్నాడట. ముఖ్యంగా టాక్సిక్ మూవీని కన్నడతో పాటు ఇంగ్లీషులో కూడా షూట్ చేస్తున్నారట. ఒకేసారి కన్నడ, ఇంగ్లీషులో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా టాక్సిక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ భారీ యాక్షన్ మూవీ పై ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించి అనేలా ఉంటుందట. అలాగే ఆడియన్స్ కి హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే థ్రిల్ కలిగించడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు.