లవర్స్ ఎమోషన్స్ ను కరెక్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే పాటలు కొన్నే వస్తుంటాయి. వినగానే అలాంటి సాంగ్ అనే ఫీల్ కలిగిస్తోంది “కన్యాకుమారి” సినిమాలోని ఎద ఎద సవ్వడి పాట. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న ఈ సినిమాను రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా సృజన్ అట్టాడ రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కన్యాకుమారి” సినిమా నుంచి ‘యద యద సవ్వడి..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘యద యద సవ్వడి..’ పాటకు డైరెక్టర్ సృజన్ అట్టాడ మంచి లవ్ ఫీల్ ఉన్న లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నిడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. ‘యద యద సవ్వడి, చేసెను సందడి, నువ్వు నన్ను తాకగా, రేగెను అలజడి, అట్ట అట్ట సూడకే ఎట్ట ఎట్ట ఆపనే, పొంగుతున్న ప్రేమనే.. పిల్లా’ అంటూ సాగుతుందీ పాట. “కన్యాకుమారి” సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘కత్తిలాంటి పిల్లవే..’ సాంగ్ ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడీ పాట కూడా సక్సెస్ అయ్యే వైబ్స్ కనిపిస్తున్నాయి.