గాడ్ ఫాదర్ రిజెల్ట్ తో టెన్షన్ లో.. భోళా శంకర్

ఇప్పుడు ట్రెండ్ మారింది. వరల్డ్ మూవీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఓటీటీ. దీని వలన వేరే రాష్ట్రాల్లో ఏ సినిమాలు వస్తున్నాయి. అందులో కథ ఎలా ఉంటుంది..? వేరే రాష్ట్రాల్లోనే కాదు.. వేరే దేశాల్లో కూడా ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది సామాన్య జనాలకు తెలుస్తుంది. అంతే కాకుండా ఓటీటీలో ఆ సినిమాలను చూడడం వలన రీమేక్ చిత్రాలు చూసేందుకు జనాలు ముందుకు రావడం లేదు. ఏ సినిమాకి అయినా కథ ఏంటి..? అనేది తెలియకపోతే ఇంట్రస్ట్ ఉంటుంది కానీ.. కథ ముందే తెలిసిపోతే ఇంట్రస్ట్ ఉండదు.

గాడ్ ఫాదర్ మూవీ మలయాళం లూసీఫర్ మూవీకి రీమేక్. ఈ సినిమా కథ ముందుగానే తెలిసిపోవడం వలన జనాలు గాడ్ ఫాదర్ మూవీ చూడడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఇప్పుడు భోళా శంకర్ పరిస్థితి కూడా అంతే. ఈ సినిమా వేదాళం సినిమాకి రీమేక్. అందుచేత ఈ సినిమా కథ ఏంటి అనేది జనాలుక తెలుసు. అందుచేత భోళా శంకర్ నుంచి టీజర్ వచ్చినా.. పాటలు వచ్చినా అంతగా ఆడియన్స్ కి కిక్ ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే.. సినిమాని ఎంతలా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించినా బజ్ క్రియేట్ అవ్వడం లేదు.

ఇటీవల భోళా శంకర్ నుంచి రెండు పాటలు రిలీజ్ చేశారు కానీ.. అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఈ నెల 27 భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అభిమానులూ… మెగా ఎంటర్టయినింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ అంటూ దర్శకుడు మెహర్ రమేశ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ బాణీలు కట్టిన పాటలు ఇటీవల విడుదలైయ్యాయి. భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మరో అందాల భామ కీర్తి సురేశ్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఆగష్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. మరి.. భోళా శంకర్ గాడ్ ఫాదర్ వలే.. యావరేజ్ గా ఆడుతుంతో.. వాల్తేరు వీరయ్యలా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.