జులై 28 నుంచి ఆగష్టు 25 వరకు మెగా హీరోలు మూడు సినిమాలతో రానున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఒకే కుటుంబం నుంచి నెల గ్యాప్ లో మూడు సినిమాలు రావడం అనేది అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. అయితే.. జులై 28న పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజైంది. సముద్రఖని తెరకెక్కించిన బ్రో సినిమా ఫరవాలేదు అనిపించింది కానీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు మిగిల్చింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రిలీజైంది. ప్లాపు చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళాశంకర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపు అయ్యింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ చిరంజీవి చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఓటీటీలో ఈ సినిమా లేదు కాబట్టి
జనాలు చూస్తారనుకున్నాడు. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. రీమేక్ సినిమాలు చూసే పరిస్థితి లేదు. అందుకనే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే భోళాశంకర్ ప్లాప్ టాక్ వచ్చింది. పవన్, చిరు ఇద్దరూ సక్సెస్ సాధించలేదు. ఇక మిగిలింది వరుణ్ తేజ్.
ఈ నెల 25న వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున అంటూ వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. గని ఫ్లాప్ తర్వాత వరుణ్ చేసిన సినిమా ఇది. ఈ సక్సెస్ వరుణ్ కి చాలా అవసరం. మరి.. వరుణ్ తేజ్ అయినా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.