కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ముకుంద సినిమాతో కూడా సక్సెస్ సాధించాడు. అయితే.. శ్రీకాంత్ అడ్డాల అంటే.. సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. అలాంటిది ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్ తో నారప్ప అనే యాక్షన్ మూవీని తెరకెక్కించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు పెదకాపు 1 అంటూ మరోసారి భారీ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.
పెదకాపు అనే టైటిల్ తో మాస్ మూవీ చేయడమే ఓ సంచలనం అనుకుంటే.. ఈ చిత్రాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పార్టులుగా చేయాలి అనుకోవడం మరో సంచలనం అని చెప్పచ్చు. మూడు పార్టులు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. పెదకాపు మూడు పార్టులుగా రానుందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల తన బలమైన సున్నితమైన కథలను పక్కనపెట్టి మాస్ మూవీస్ తో మెప్పించాలని తపిస్తున్నారు. మరి… శ్రీకాంత్ అడ్డాల మాస్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.