“తమ్ముడు” రిలీజ్ డేట్ ఇదేనా ?

నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా రిలీజ్ పై నెట్టింట ఓ డేట్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమా జూలై 4న థియేటర్స్ లోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ పై మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయాల్సిఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు రూపొందిస్తున్నారు. నటి లయ నితిన్ కు అక్క క్యారెక్టర్ లో కనిపించనుంది.

వకీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రమిది. తమ్ముడు సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 4 రిలీజ్ కు వెళ్తే ..పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు కావాల్సినంత సమయం ఉంటుందని మూవీ టీమ్ భావిస్తోంది.