ఈ బాలీవుడ్ భామకు ఈసారి హిట్టొచ్చేనా?

బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె అడివి శేష్ సరసన మేజర్, వరుణ్ తేజ్ తో ఘని చిత్రాల్లో నటించింది. మేజర్ పాన్ ఇండియా మూవీగా గుర్తింపు పొందినా..తెలుగులో సయీకి కావాల్సిన కమర్షయిల్ హీరోయిన్ ముద్ర వేయలేకపోయింది. ఇదొక వీర సైనికుడి బయోపిక్ కాబట్టి క్రెడిట్ మొత్తం హీరో అడివి శేష్ కు వెళ్లింది. వరుణ్ తేజ్ ఘని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో సయికి ఏమాత్రం క్రేజ్ రాలేదు.

ఇక మూడోసారి తన లక్ చెక్ చేసుకుంటోందీ బాలీవుడ్ బ్యూటి. ఆమె రామ్ సరసన స్కంధ సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో..ఈసారి తనకు రావాల్సినంత గుర్తింపు వస్తుందని సయీ హోప్స్ పెట్టుకుంది. స్కంధ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ కాబట్టి ఈ సినిమా ఏమాత్రం పాజిటిట్ టాక్ తెచ్చుకున్న అది ఈ హీరోయిన్ ఫ్లస్ పాయింట్ అవుతుంది. స్కంధ రిలీజ్ తర్వాత ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఫ్యూచర్ అవకాశాలు ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు.