హరీశ్ శంకర్ ను రామ్ పక్కన పెట్టేసినట్లేనా?

ఎనర్జిటిక్ హీరో అనగానే రామ్(Ram pothineni) గుర్తొస్తాడు. ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుంటాడు. అందుకనే ఎనర్జిటిక్ హీరో అనే పేరు సొంతం చేసుకున్నాడు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్(Double ismart) సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇలా వరుసగా ఫ్లాపులు రావడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడట రామ్. మరి.. ఎనర్జిటిక్ హీరో నెక్ట్స్ ఏంటి..?

రామ్, పూరి కాంబోలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తుంది అనుకున్నాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ మూవీలో క్యారెక్టర్ కు రామ్ పూర్తి న్యాయం చేశాడు కానీ.. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. మాస్ ఆడియన్స్ నచ్చేస్తుంది.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధిస్తుందని పూరి బలంగా నమ్మారు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. కథలో కొత్తదనం లేకపోతే జనాలు చూడడం లేదు. అందుకనే ఎన్నో అంచనాలతో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ప్లాప్ మూవీగా నిలిచింది.

రామ్ నెక్ట్స్ ఏంటి అంటే.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ మహేష్(P.mahesh babu) ఓ కథ చెప్పడం జరిగింది. అలాగే హరీష్ శంకర్ కూడా రామ్ కు ఓ కథ చెప్పడం జరిగింది. వీరిద్దరితో రామ్ సినిమాలు కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్ అయ్యింది. మరి.. ఇలాంటి టైమ్ లో హరీష్‌ తో మూవీ చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో కానీ.. ముందుగా డైరెక్టర్ మహేష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడీ ఎనర్జిటిక్ హీరో. ఈ సినిమా రిలీజ్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయ్యుంటే.. ముందుగా హరీష్ శంకర్ తో సినిమా చేసుండేవాడేమో. ఈసారి మాస్ మూవీ కాకుండా తన నుంచి ఆడియన్స్ ఆశించే మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు.