రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గురించి అటు సుకుమార్, ఇటు పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల యు.ఎస్ లో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ రంగస్దలం సినిమాకు గాను చరణ్‌కు నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నాను కానీ రాలేదు. గేమ్ ఛేంజర్ కు మాత్రం ఖచ్చితంగా చరణ్ కు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పారు సుకుమార్. గేమ్ ఛేంజర్ కోసం ఏపీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవర్ స్టార్ ఇలాగే స్పందించారు. రామ్ చరణ్ ఏడేళ్ల వయసులో తెల్లవారుజామునే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడని… చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణతో ఉండేవాడు అన్నారు పవర్ స్టార్. అతనిలో ఇంత ప్రతిభ, సమర్థత ఉందని ఎవరికీ తెలియలేదు. సినిమాలో తప్పా బయట డ్యాన్స్ చేయడం నేనెప్పుడూ చూడలేదు అన్నారు.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకున్నా. అంత గొప్ప పెర్ఫార్మన్స్ చేసాడు. అతను ఆంధ్రాలో పెరగలేదు.. తమిళనాడు, హైదరాబాద్ లో పెరిగాడు. గోదావరి జిల్లాల తాలూకు భావాలు, కల్చర్ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. అవన్నీ తెలియకపోయినా ఆ క్యారక్టర్ లో ఇమిడిపోయి, కొన్ని తరాలుగా గోదావరి ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా తను యాక్ట్ చేసిన విధానం నాకు అమితంగా నచ్చింది. అతనిలో అంత గొప్ప నటుడు ఉన్నాడు. భవిష్యత్‌లో రామ్ చరణ్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని ఆకాక్షించారు. చరణ్ విషయంలో సుకుమార్, పవర్ స్టార్ ఒకేలా స్పందించారు. మరి.. వీరిద్దరూ అనుకున్నట్టుగా చరణ్ నేషనల్ అవార్డ్ గెలుసుకుంటాడేమో చూడాలి.