ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా దర్శకుడు పూరి జగన్నాథ్ కు మరొక అవకాశం వస్తూనే ఉంది. పూరి తాజాగా విజయ్ సేతుపతి హీరోగా తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిన్న ఉగాది రోజున ఈ క్రేజీ కాంబో మూవీని అఫీషియల్ గా ప్రకటించారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి తెరకెక్కించే సినిమాకి నిర్మాత ఛార్మి కాదని.. వేరే నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ.. అందులో వాస్తవం లేదని అనౌన్స్ మెంట్ ను బట్టి తెలిసింది.
ఈ చిత్రాన్ని కూడా పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రేజీ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాశ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో పూరి మళ్లీ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూరి పై నమ్మకంతో విజయ్ సేతుపతి సినిమా చేయడానికి ఓకే చెప్పారు. పూరి..ఈ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.