టీమ్ చెబుతున్నారు గానీ పవన్ వస్తాడా ?

పవర్ స్టార్, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా లాక్ డౌన్ టైమ్ లో మొదలై…ఇప్పటికీ పూర్తి కాలేదు. నా వల్ల కాదంటూ డైరెక్టర్ క్రిష్ వెళ్లిపోయాడు. ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టాడు. ఇటీవల పవన్ లేకుండానే షూటింగ్ చేశారు. ఇప్పుడు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు మూవీ టీమ్ చెబుతున్నారు.

ఈ నెల 23వ తేదీ నుంచి విజయవాడలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటాడని మేకర్స్ ఈరోజు వెల్లడించారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నారట. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు పాల్గొననున్నారు. అయితే పొలిటికల్ గా పలు ఇష్యూస్ ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న ఈ సమయంలో డిఫ్యూటీ సీఎంగా ఉన్న పవన్ షూటింగ్ కు వస్తాడా వస్తే షెడ్యూల్ ఎప్పటికి కంప్లీట్ చేస్తాడు అనేది చూడాలి.