ఎన్టీఆర్ ఆ టార్గెట్ రీచ్ కావడం కష్టమే

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ క్రేజీ కాంబోలో మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ షూట్ స్టార్ట్ చేశారు. దాదాపు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ ను చిత్రీకరిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి డ్రాగెన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా షూట్ లో మార్చి నుంచి ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. వార్ 2 షూట్ లో బిజీగా ఉండడం వలన ఈ మూవీ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ ఓ పది రోజులు పాటు చేయనున్నారు. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఎన్టీఆర్ ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా, చాలా కొత్తగా చూపించబోతున్నాడట నీల్. అయితే.. ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా షూటింగ్ స్టార్ట్ కాకుండానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు టైమ్ చూస్తే.. పది నెలలే ఉంది. ఇదోమో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. షూటింగ్ కు ఎక్కువ టైమ్ పడుతుంది. అందుచేత అనౌన్స్ చేసినట్టుగా జనవరి 9న రావడం కష్టమనే చెప్పాలి.