ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా వార్ 2. ఈ చిత్రంతో స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ కలిసి నటిస్తుండడంతో.. వీరిద్దరి అభిమానులే కాదు.. మూవీ లవర్స్ అందరూ ఈగర్ గా ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలు నువ్వా..? నేనా..? అని తలపడేట్టుగా ఉంటాయని ఆమధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తాడని టాలీవుడ్, బాలీవుడ్ లో వినిపిస్తోంది. అసలు నిజం ఏంటంటే.. ఎన్టీఆర్ పాత్రలో టు షేడ్స్ ఉంటాయట. ఒకటి పాజిటివ్ షేడ్ అయితే.. మరొకటి నెగిటివ్ షేడ్ అని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. జై లవకుశ సినిమాలో రావణ్ క్యారెక్టర్ లో చూపించినట్టుగా విలనిజం చూపిస్తాడని టాక్.
వార్ 2 కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. అలాగే ఇద్దరి మధ్య ఓ సాంగ్ ఉంటుందట. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటలో ఎన్టీఆర్, చరణ్ ఎలా అయితే.. పోటీపడి డ్యాన్స్ చేశారో.. ఇందులో అంతకు మించి అనేలా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఓ పాట ఉంటుందట. ఈ పాటను కూడా ఆల్రెడీ షూట్ చేశారని సమాచారం. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. త్వరలో వార్ 2 సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. ఆగష్టు 14న వార్ 2 మూవీని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.