నారా రోహిత్ విభిన్న కథా చిత్రాల్లో నటించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. బాణం, సోలో, ప్రతినిధి చిత్రాలతో మెప్పించి కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఒకానొక దశలో నెలకో సినిమా రిలీజ్ చేసేవాడు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో..? ఏ సినిమా షూటింగ్ లో ఉందో కూడా క్లారిటీ ఉండేది కాదు. అంతలా బిజీగా ఉండి వరుసగా సినిమాలు రిలీజ్ చేసేవాడు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కథల ఎంపికలో పొరపాట్లు.. ఫిజిక్ పై దృష్టి పెట్టకపోవడం వలన వరుసగా పరాజయాలు వచ్చాయి.
దాంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఒక సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోకి వెళతాడనే ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి మళ్లీ రావాలని ట్రై చేస్తున్నాడట. ప్రతినిధి చిత్రానికి సీక్వెల్ చేయాలి అనుకుంటున్నాడట. సమాజానికి ఎన్నో ప్రశ్నల్ని సంధించిన ప్రతినిధి చిత్రానికి సీక్వెల్ గా ప్రతినిధి 2 చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈసారి మీడియా టార్గెట్ గా ఈ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.ఆగష్టులో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలిసింది. రీ ఎంట్రీకి మంచి సినిమానే ఎంచుకున్నాడు. మరి.. ఈ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.