రీమేక్ లకు మెగాస్టార్ బ్రేక్ వేసినట్లేనా?

విజయ్ “కత్తి” సినిమా రీమేక్ గా ఖైదీ నెంబర్ 150, మలయాళ హిట్ ఫిల్మ్ “లూసీఫర్” రీమేక్ గా గాడ్ ఫాదర్, అజిత్ హీరోగా నటించిన “వేదాళం” రీమేక్ గా భోళా శంకర్ సినిమాలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. వీటిలో గాడ్ ఫాదర్ ఒక్కటే జెన్యూన్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ సినిమాకు టాక్ కు తగిన వసూళ్లు రాలేదు. ఇక చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా బయ్యర్లకు రూపాయికి ముప్పావళా నష్టాలు వచ్చాయి.

ఈ సినిమా రిజల్ట్ నేపథ్యంలో నెటిజన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ రీమేక్స్ కు దూరంగా ఉండాలంటూ…మన నేటివిటీతో కూడిన ప్యూర్ మూవీస్ చేయాలంటూ రిక్వెస్టులు, సూచనలు చేశారు. వీటితో పాటు జబర్దస్త్ ను పోలిన కామెడీ సీన్స్ చేయొద్దంటూ అభిమానులూ కోరారు. ఇవన్నీ మెగాస్టార్ ను ఆలోచనలో పడేసినట్లు ఉన్నాయి. ఇక తను చేయబోయే రెండు కొత్త సినిమాలను ఒరిజినల్ తెలుగు కథలోనే చేయబోతున్నారు.

“బింబిసార” దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న సినిమాతో పాటు తన కూతురు సుస్మిత నిర్మాణంలో నటిస్తున్న చిత్రంలోనూ చిరంజీవి ఎలాంటి రీమేక్ అంశాలు లేకుండా పూర్తి ఒరిజినల్ స్క్రిప్ట్ నే ఎంచుకున్నారట. దీంతో మెగాస్టార్ కొన్నాళ్లు ఈ రీమేక్ లకు బ్రేక్ ఇచ్చినట్లే అనుకోవాలి.